టాప్ ఫైవ్‌లో నిలుస్తుందని సుకుమార్ అన్నారు
ABN, Publish Date - Feb 05 , 2025 | 05:18 AM
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన చిత్రం ‘తండేల్’. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. ఈ నెల 7న సినిమా...
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన చిత్రం ‘తండేల్’. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. ఈ నెల 7న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘‘చాలా రోజుల తర్వాత నేను పనిచేసిన స్వచ్ఛమైన ప్రేమకథ ఇది. ఇందులోని పాటలకు వస్తున్న అద్భుతమైన ఆదరణ పట్ల సంతోషంగా ఉన్నాను. సుకుమార్ ‘తండేల్’ పాటలు విని.. నీ కెరీర్‌లో టాప్ ఫైవ్ చిత్రాల్లో ఈ ఆల్బమ్ ఒకటిగా నిలుస్తుందన్నారు. కమర్షియల్ సినిమాలతో పాటు ప్రేమ కథలకు సంగీతాన్ని ఇవ్వడాన్ని ఆస్వాదిస్తా. ప్రేమ పాటలకు రీచ్ ఎక్కువ ఉంటుంది. అవి ఎవర్‌గ్రీన్. కెరీర్ పరంగా సంతృప్తికరంగా ఉన్నా. ఇప్పటివరకూ అన్ని రకాల సినిమాలకు పనిచేసే అవకాశం వచ్చింది.
నా సంగీతం అన్ని వర్గాలకు రీచ్ అవడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. ‘తండేల్’ వాస్తవిక సంఘటనల ఆధారంగా తయారుచేసుకున్న కథ. ఇందులో నేపథ్య సంగీతం చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడు చందు విజన్ ఈ సినిమాకు ప్రధానాకర్షణ’’ అని చెప్పారు.