తమిళంలోకి ఎంట్రీ
ABN , Publish Date - May 06 , 2025 | 05:24 AM
స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా కథాంశంతో తమిళ నిర్మాత ఎల్రెడ్ కుమార్ నిర్మించే కొత్త తమిళ చిత్రం ‘మండాడి’. ప్రధాన పాత్రలో సూరి నటించనున్నారు. తెలుగు నటుడు సుహాస్ ఈ చిత్రంతోనే తమిళ చిత్రపరిశ్రమలోకి...
స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా కథాంశంతో తమిళ నిర్మాత ఎల్రెడ్ కుమార్ నిర్మించే కొత్త తమిళ చిత్రం ‘మండాడి’. ప్రధాన పాత్రలో సూరి నటించనున్నారు. తెలుగు నటుడు సుహాస్ ఈ చిత్రంతోనే తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. సినిమాలో ఆయన ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. సూరి, సుహాస్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. మహిమా నంబియార్ కథానాయికగా నటించే ఈ సినిమాకు ‘సెల్ఫీ’ చిత్ర దర్శకుడు మతిమారన్ పుహళేంది దర్శకత్వం వహించనున్నారు. అన్ని భాషల్లోనూ ఆకట్టుకొనే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ను, సుహాస్ ఫస్ట్ లుక్‌ను నిర్మాత విడుదల చేశారు.