కొత్త చిత్రం ఖరారు
ABN , Publish Date - May 12 , 2025 | 05:00 AM
సుధీర్‌బాబు కథానాయకుడిగా నటించే కొత్త చిత్రం ఖరారైంది. ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు...
సుధీర్‌బాబు కథానాయకుడిగా నటించే కొత్త చిత్రం ఖరారైంది. ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆదివారం చిత్రబృందం ఈ విషయాన్ని ప్రకటించి, అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో సుధీర్‌బాబు సరికొత్త లుక్‌లో ఆకట్టుకున్నారు. సర్వైవల్ థ్రిల్లర్ జానర్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపింది.