అలాంటి సినిమాలను నిషేధించాలి

ABN , Publish Date - Jan 06 , 2025 | 06:25 AM

‘నిండు సభలో ద్రౌపది వస్త్రాన్ని తీస్తున్నా మౌనంగా ఉన్న కర్ణుడు గొప్పవాడు ఎలా అవుతాడు? పురాణ ఇతిహాసాలను సినిమావాళ్లు తమ ఇష్టం వచ్చినట్లు మార్చి హైందవ ధర్మాన్ని వక్రీకరిస్తున్నారు’ అని అన్నారు...

‘నిండు సభలో ద్రౌపది వస్త్రాన్ని తీస్తున్నా మౌనంగా ఉన్న కర్ణుడు గొప్పవాడు ఎలా అవుతాడు? పురాణ ఇతిహాసాలను సినిమావాళ్లు తమ ఇష్టం వచ్చినట్లు మార్చి హైందవ ధర్మాన్ని వక్రీకరిస్తున్నారు’ అని అన్నారు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌. గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద విశ్వ హిందూపరిషత్‌(వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హైందవ శంఖారావం’ సభలో ఆయన మాట్లాడుతూ. ‘హిందూ ధర్మాన్ని అవమానించేలా తీసిన సినిమాలను ప్రభుత్వం నిషేధించాలి. లేదంటే హిందువులే పూర్తిగా వాటిని బహిష్కరించాలి. అప్పుడే హిందూ ధర్మానికి ఒక గౌరవం, గుర్తింపు ఉంటాయి. సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి జరుగుతోంది. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం..భారత సాహిత్య వాజ్మయానికి రెండు కళ్లు వంటివి. అలాంటి వాటిని వినోదం కోసం వక్రీకరిస్తున్నారు. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను ప్రతి ఒక్కరూ బహిష్కరించాలి. అప్పుడు ఆ సినిమాలకు డబ్బులు రావు. డబ్బులు రాకపోతే ఇలాంటి చిత్రాలను నిర్మాతలు తీయరు’ అని ఆయన అన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 06:25 AM