నవ్వించడమే సింగిల్‌ లక్ష్యం

ABN, Publish Date - May 09 , 2025 | 01:17 AM

‘మొదటి నుంచి చివరి వరకూ ప్రేక్షకుల్ని నవ్వించాలనే లక్ష్యంతో తీసిన సినిమా ‘సింగిల్‌’. కథ, స్ర్కీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుంది. ఈ కథ ఆద్యంతం హాస్యంతో నవ్విస్తుంది...

‘మొదటి నుంచి చివరి వరకూ ప్రేక్షకుల్ని నవ్వించాలనే లక్ష్యంతో తీసిన సినిమా ‘సింగిల్‌’. కథ, స్ర్కీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తుంది. ఈ కథ ఆద్యంతం హాస్యంతో నవ్విస్తుంది. వ్యంగ్యం, వినోదం కలబోసిన సినిమా ఇది’ అని శ్రీవిష్ణు అన్నారు. ఆయన కథానాయకుడిగా కార్తీక్‌ రాజు దర్శకత్వం వహించారు. నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్‌, రియాజ్‌ చౌదరి నిర్మించారు. శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా శ్రీవిష్ణు మీడియాతో ముచ్చటించారు.

  • ఆద్యంతం వినోద ప్రధానంగా సాగే ప్రేమకథా చిత్రమిది. ముక్కోణపు ప్రేమకథలతో ఇప్పటివరకూ చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇందులో దర్శకుడు సరికొత్త కోణంలో కథను ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. యువతకు చాలా బాగా నచ్చుతుంది. పాత్రల తాలూకు భావోద్వేగాలను ప్రేక్షకులు అనుభూతి చెందుతారు. కుటుంబంతో కలసి ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది.


  • గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా. కార్తీక్‌ రాజు కథ చెప్పినప్పుడు మంచి ఎంటర్‌టైనర్‌ అవుతుందనిపించింది. వెన్నెల కిశోర్‌ ముఖ్య భూమిక పోషించారు. ఈ సినిమాలో నా బాడీ లాంగ్వేజ్‌ కొత్తగా ఉంటుంది. సినిమాను పూర్తిగా హైదరాబాద్‌లో చిత్రీకరించాం. ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌ని ఇంత కొత్తగా ఎవరూ చూపించలేదు. విశాల్‌ చంద్రశేఖర్‌ హై ఎనర్జిటిక్‌ సాంగ్స్‌ ఇచ్చారు. వేల్‌రాజు సినిమాటోగ్రఫీలో హైదరాబాద్‌ని కొత్తగా చూడబోతున్నారు. కేతిక శర్మ, ఇవానా నటన ప్రేక్షకులను అలరిస్తుంది. వారి పాత్రల్లోని భిన్నఛాయలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి.

Updated Date - May 09 , 2025 | 01:17 AM