ఆషికి-3లో శ్రీలీల
ABN , Publish Date - Feb 17 , 2025 | 03:02 AM
పుష్ప-2 సినిమాలో కిస్సిక్ పాటతో అభిమానులను అలరించారు కథానాయిక శ్రీలీల. కొంతకాలంగా ఆమె బాలీవుడ్ అరంగే ట్రంపై ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చింది. ‘ఆషికీ 3’ చిత్రంలో ఆమె కథానాయికగా...
పుష్ప-2 సినిమాలో కిస్సిక్ పాటతో అభిమానులను అలరించారు కథానాయిక శ్రీలీల. కొంతకాలంగా ఆమె బాలీవుడ్ అరంగే ట్రంపై ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చింది. ‘ఆషికీ 3’ చిత్రంలో ఆమె కథానాయికగా ఎంపికయ్యారు. ఇందులో కార్తిక్ ఆర్యన్ సరసన శ్రీలీల కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ టీజర్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అనురాగ్ బసు దర్శకత్వంలో టీ సిరీస్, అనురాగ్ బసు ప్రొడక్షన్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ నిర్మిస్తున్నారు. కాగా, టీజర్‌లో బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ ‘ఆషికి-2’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతున్నట్లు అర్థమవుతోంది. 1990లో ‘ఆషికి’ మొదటి భాగం విడుదలై ఘన విజయం సాధించింది. ఆ తర్వాత 2013లో ‘ఆషికి-2’ వచ్చింది. ఈ చిత్రం దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా వస్తున్న ‘ఆషికి-3’లో శ్రీలీల నటిస్తుండటం ఆమె అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
For Telangana News And Telugu News