మరోసారి కిస్సిక్‌

ABN , Publish Date - Mar 06 , 2025 | 05:01 AM

వెండితెరపైన హుషారైన స్టెప్పులతో అలరిస్తున్న కథానాయిక శ్రీలీల ఓ పార్టీలోనూ తన డ్యాన్స్‌తో సందడి చేశారు. బాలీవుడ్‌ కథానాయకుడు కార్తీక్‌ ఆర్యన్‌తో ఆమె ‘ఆషికీ 3’...

వెండితెరపైన హుషారైన స్టెప్పులతో అలరిస్తున్న కథానాయిక శ్రీలీల ఓ పార్టీలోనూ తన డ్యాన్స్‌తో సందడి చేశారు. బాలీవుడ్‌ కథానాయకుడు కార్తీక్‌ ఆర్యన్‌తో ఆమె ‘ఆషికీ 3’ చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షూటింగ్‌లో శ్రీలీల పాల్గొంటున్నారు. ఇటీవలే కార్తీక్‌ ఆర్యన్‌ తన సోదరి కృతిక తివారికి పార్టీ ఇచ్చారట. ఈ వేడుకకు హాజరైన శ్రీలీల ‘పుష్ప 2’ చిత్రంలోని ‘కిస్సిక్‌’ పాటతో పాటు మరికొన్ని హిందీ గీతాలకు స్టెప్పులేసి ఎంటర్‌టైన్‌ చేశారు. ఆమెతో పాటు కార్తీక్‌ ఆర్యన్‌ సైతం కాలు కదిపారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. నితిన్‌తో శ్రీలీల నటించిన ‘రాబిన్‌హుడ్‌’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Mar 06 , 2025 | 05:01 AM