Sri Sri Sri Rajavaru Movie: ఫ్యామిలీ ఎంటర్టైనర్
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:26 AM
నార్నె నితిన్ కథానాయకుడిగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ చిత్రం ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sri Sri Sri Rajavaru Movie: నార్నె నితిన్ కథానాయకుడిగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’. సంపద కథానాయిక. శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. శనివారం చిత్రబృందం నిర్వహించిన కార్యక్రమంలో మేకర్స్ ట్రైలర్ను ఆవిష్కరించి, విడుదల తేదీని ప్రకటించారు. ఈనెల 6న ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సతీశ్ వేగేశ్న మాట్లాడుతూ ‘‘ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్. మనల్ని మనం జయించ డమే సక్సెస్’ అంటే అని ఈ సినిమాలో నరేశ్ గారికి ఒక డైలాగ్ ఉంది. ఈ కాన్సె్ప్టతోనే సినిమాను రూపొందించాం. నార్నే నితిన్లోని యాక్షన్ కోణం ఈ సినిమాలో ప్రేక్షకులను ఆక ట్టుకుంటుంది’ అన్నారు. పూర్తి కమర్షియల్ ఫార్మాట్లో భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని చింతపల్లి రామారావు తెలిపారు.