15 రోజుల్లో సగం సినిమా షూటింగ్ పూర్తి చేసిన చిత్ర బృందం
ABN , Publish Date - Jan 11 , 2025 | 09:10 PM
డిసెంబర్ 26న మొదలు పెట్టుకుని 15 రోజులపాటు పగలు, రాత్రి షూటింగ్ చేస్తూ.. ఇప్పటికి సగభాగం షూటింగ్ పూర్తి చేశామని తెలిపారు స్ప్లాష్ కలర్స్ మీడియా బ్యానర్‌లో మూవీ చేస్తున్న చిత్ర బృందం. వివరాల్లోకి వెళితే..
స్ప్లాష్ కలర్స్ మీడియా, అలీనియ అవిజ్ఞ స్టూడియోస్ మరియు సెటిల్ కింగ్ ప్రొడక్షన్ బ్యానర్లపై వేణుబాబు నిర్మాతగా ఘంటసాల విశ్వనాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పవన్ చరణ్, జీవీ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు దిలీప్ కుమార్ చిన్నయ్య సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆదర్శ్ పుందిర్, అశ్రీత్ రెడ్డి, ప్రియాంక సింగ్, పూజిత పుందిర్, రాజ్ గౌడ్, సునందిని, మధుసూదన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా వివరాలను తెలిపేందుకు చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఘంటసాల విశ్వనాథ్ మాట్లాడుతూ.. స్ప్లాష్ కలర్స్ మీడియా బ్యానర్‌పై మేము చేస్తున్న తొలి చిత్రమిది. అశ్రిత్, ఆదర్శ్, ప్రియాంక సింగ్ ముఖ్యపాత్రలు పోషిస్తూ వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 26న మొదలు పెట్టుకుని 15 రోజులపాటు పగలు, రాత్రి షూటింగ్ చేస్తూ.. ఇప్పటికి సగభాగం షూటింగ్ పూర్తి చేశాము. మిగతా సగభాగం షూటింగ్ కోసం యుఎస్ వెళ్తున్నాము. టెక్నాలజీ, ఎమోషన్, లింగ సమానత్వంపై ఉండబోతున్న ఈ చిత్రం 2025లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాము. మా ప్రయత్నం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నామని అన్నారు.
Also Read-Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ
ఈ సందర్భంగా చిత్ర నటి ప్రియాంక సింగ్ మాట్లాడుతూ.. జీవి విశ్వనాథ్ దర్శకత్వంలో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నా క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఇటువంటి సినిమాలు రావడం లేదు. కాబట్టి ఈ సినిమా ఎంతో స్పెషల్‌గా ఉండబోతుంది. అందుకుగాను ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. అందరూ ఎంతో సహకారం అందిస్తున్నారని తెలపగా.. ఇతర నటులైన ఆదర్శ్ పందిరి, అశ్రిత్ రెడ్డి, పూజిత మందిర్, సినిమాటోగ్రాఫర్ దిలీప్ కుమార్.. ఈ అవకాశం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.