నా అహం కంటే మీపై ప్రేమే ఎక్కువ
ABN, Publish Date - May 07 , 2025 | 01:33 AM
ఇటీవల జరిగిన ఓ కాన్సర్ట్‌లో గాయకుడు సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, దాని వల్ల ఏర్పడిన పరిణామాలు అందరికీ తెలిసిందే. దీంతో ఈ వ్యవహారంపై సోనూ నిగమ్ స్పందించారు...
ఇటీవల జరిగిన ఓ కాన్సర్ట్‌లో గాయకుడు సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, దాని వల్ల ఏర్పడిన పరిణామాలు అందరికీ తెలిసిందే. దీంతో ఈ వ్యవహారంపై సోనూ నిగమ్ స్పందించారు. ఆ కాన్సర్ట్‌లో తను చేసిన వాఖ్యలపై వివరణ ఇచ్చి, క్షమాపణలు తెలిపారు. ‘సారీ కర్ణాటక. నా అహం కంటే మీపై నాకున్న ప్రేమే ఎక్కువ’ అని సోషల్‌మీడియా వేదికగా పేర్కొన్నారు. కాగా, ఆ కాన్సర్ట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలపైౖ ‘కర్ణాటక రక్షణ వేదిక’ బెంగుళూరు సిటీ యూనిట్ అధ్యక్షుడు ధర్మరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారం రోజుల్లోపు విచారణలో పాల్గొనాలని పోలీసులు ఆయనకు నోటీసులిచ్చారు. అలాగే, ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన ‘కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్’.. ఓ సమావేశం ఏర్పాటు చేసి ఆయనను కన్నడ సినిమాల నుంచి బ్యాన్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.