అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తుంది
ABN, Publish Date - Apr 21 , 2025 | 02:03 AM
సంపూర్ణేష్ బాబు, సంజోష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సోదరా’. మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో చంద్ర చగంలా నిర్మించారు. ఈ నెల 25న సినిమా విడుదలవుతోంది...
సంపూర్ణేష్ బాబు, సంజోష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సోదరా’. మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో చంద్ర చగంలా నిర్మించారు. ఈ నెల 25న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ ‘‘అన్నదమ్ముల అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించే ఓ అందమైన కుటుంబ కథ ఇది. ఇందులో నా రోల్ భిన్నంగా ఉంటుంది. అందరికీ తమ జీవితంలోని పలు మధురమైన సందర్భాలను గుర్తుకుతెస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అని అన్నారు. ‘‘ఇది అమాయకుడైన అన్న, అప్‌డేట్ అయిన తమ్ముడి కథ. ఇలాంటి కథాంశంతో తెలుగులో ఇంతవరకూ ఏ సినిమా రాలేదు. అందరూ కనెక్ట్ అవుతారు. ఇందులోని భావోద్వేగాలు ప్రేక్షకులను నవ్విస్తాయి, ఏడిపిస్తాయి’’ అని సంజోష్ చెప్పారు.