‘మదరాసి’గా శివకార్తికేయన్‌

ABN , Publish Date - Feb 18 , 2025 | 01:15 AM

‘అమరన్‌’తో ఘన విజయాన్ని అందుకున్నారు తమిళ నటుడు శివ కార్తికేయన్‌. ఆ తర్వాత ఆయన హీరోగా, దర్శకుడు ఏ.ఆర్‌. మురుగదాస్‌ కలయికలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే....

‘అమరన్‌’తో ఘన విజయాన్ని అందుకున్నారు తమిళ నటుడు శివ కార్తికేయన్‌. ఆ తర్వాత ఆయన హీరోగా, దర్శకుడు ఏ.ఆర్‌. మురుగదాస్‌ కలయికలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రీ లక్ష్మీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్‌ కథానాయిక. సోమవారం శివ కార్తికేయన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పేరును ‘మదరాసి’ అని ప్రకటిస్తూ నిర్మాణ సంస్థ గ్లింప్స్‌ విడుదల చేసింది. ఇందులో శివ కార్తికేయన్‌ పూర్తిగా పవర్‌-ప్యాక్డ్‌ అవతార్‌లో కనిపించారు. సినిమాలోని ఇతర పాత్రలను కూడా గ్లింప్స్‌లో పరిచయం చేశారు.


ఇవీ చదవండి:

ప్రాక్టీస్ మొదలుపెట్టిన క్రికెట్ గాడ్.. ఫ్యాన్స్‌కు పండగే

రోహిత్ తిరుగులేని వ్యూహం.. పక్కా స్కెచ్‌తో

ధోని నుంచి రోహిత్ ఎరా వరకు.. డాక్యుమెంటరీ చూశారా..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 18 , 2025 | 01:15 AM