రెట్రోను అందిస్తున్న సితార

ABN , Publish Date - Feb 28 , 2025 | 02:38 AM

విభిన్న పాత్రలు, చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న తమిళ హీరో సూర్య తాజా చిత్రం ‘రెట్రో’. మే ఒకటిన విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం తెలుగు రాష్ర్టాల థియేట్రికల్‌ రైట్స్‌ని...

విభిన్న పాత్రలు, చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న తమిళ హీరో సూర్య తాజా చిత్రం ‘రెట్రో’. మే ఒకటిన విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం తెలుగు రాష్ర్టాల థియేట్రికల్‌ రైట్స్‌ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ సొంతం చేసుకుంది. ఒకవైపు వరుసగా సినిమాలు నిర్మిస్తూ భారీ విజయాలను అందుకుంటున్న ఈ సంస్థ మరో వైపు పంపిణీరంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. సూర్య తెలుగు అభిమాననులు థియేటర్లలో పండగ చేసుకొనేలా ‘రెట్రో’ విడుదలకు ఈ సంస్థ ప్లాన్‌ చేస్తోంది. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ‘రెట్రో’లో పూజా హెగ్డే కథానాయిక. సూర్య, జ్యోతిక నేతృత్వంలో 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. జోజు జార్జీ, జయరామ్‌, నాజర్‌, ప్రకాశ్‌రాజ్‌ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్‌ పార్ట్‌ పూర్తి చేసుకున్న ‘రెట్రో’ చిత్రానికి సంబంధించి ఇప్పుడు నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

Updated Date - Feb 28 , 2025 | 02:38 AM