Producer Allu Aravind: ప్రేక్షకులు మరోసారి నిరూపించారు

ABN, Publish Date - May 17 , 2025 | 01:29 AM

అల్లు అరవింద్ నిర్మించిన ‘సింగిల్’ సినిమా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. విజయంతో స్ఫూర్తి పొందిన నిర్మాత శ్రీవిష్ణు కోసం మరో రెండు చిత్రాలు రూపొందించాలని నిర్ణయించారు.

  • అల్లు అరవింద్‌

శ్రీవిష్ణు హీరోగా కార్తిక్‌ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సింగిల్‌’. ఇవానా, కేతిక శర్మ కథానాయికలు. అల్లు అరవింద్‌ నిర్మించారు. ఈ సినిమా ఇటీవలె విడుదలై ప్రేక్షకాదరణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రబృందం సక్సె్‌సమీట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘సినిమాకు లభిస్తున్న ఆదరణను చూసి శ్రీవిష్ణుని మా ఆఫీసుకు పిలిచి గీతా ఆర్ట్స్‌లో మరో రెండు సినిమాలు చేయాలని కోరాను. సినిమా బాగుంటే థియేటర్లకు వస్తామని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. వారికి నా కృతజ్ఞతలు’ అని అన్నారు. చిత్ర కథానాయకుడు శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘మా టీమ్‌లోని వారందరికీ జీవితాంతం గుర్తుండేలా ఈ చిత్రం విజయం సాధించింది’ అని అన్నారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ‘శ్రీవిష్ణు కామెడీ టైమింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఈ మూడు నెలల్లో రెండు హిట్‌లు కొట్టిన గీతా ఆర్ట్స్‌కి, చిత్ర విజయాన్ని అందుకున్న యూనిట్‌కు నా అభినందనలు’ అని అన్నారు. చిత్ర దర్శకుడు కార్తిక్‌ రాజు మాట్లాడుతూ ‘చిత్రబృందంలోని ప్రతీ ఒక్కరు అద్భుతంగా పనిచేయడం వల్లనే సినిమా ఇంతటి విజయాన్ని సాధించింది’ అని అన్నారు.

Updated Date - May 17 , 2025 | 01:29 AM