Shraddha Kapoor: థ్రిల్లర్‌ కథాంశంతో

ABN, Publish Date - May 03 , 2025 | 06:33 AM

‘స్త్రీ 2’ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అవ్వడంతో శ్రద్ధాకపూర్‌ బాలీవుడ్‌లో ప్రముఖ కథానాయికగా మారారు. ఆమె అంగీకరించిన కొత్త థ్రిల్లర్‌ చిత్రం రూ. 17 కోట్ల పారితోషికంతో ఏక్తాకపూర్‌ నిర్మిస్తున్నారు.

‘స్త్రీ 2’ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అవ్వడంతో బాలీవుడ్‌లో శ్రద్ధాకపూర్‌ దశ తిరిగింది. ఆ విజయంతో ఒక్కసారిగా ఆమె డిమాండ్‌ ఉన్న కథానాయికగా మారారు. హిందీ పరిశ్రమలోని అగ్ర నిర్మాణ సంస్థల నుంచి శ్రద్ధకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆమె మాత్రం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాలకే శ్రద్ధాకపూర్‌ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏక్తాకపూర్‌ నిర్మాతగా తెరకెక్కుతోన్న చిత్రంలో నటించేందుకు శ్రధ్ధా అంగీకరించారనీ, ఇందుకోసం రూ. 17 కోట్లు పారితోషికంగా అందుకోంటున్నారని బాలీవుడ్‌ టాక్‌. థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘తుంబాడ్‌’ ఫేమ్‌ రహి అనిల్‌ బర్వే దర్శకత్వం వహించనున్నారట. ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. శ్రధ్దాకపూర్‌ కెరీర్‌లో ఇప్పటివరకూ ఆమె అందుకున్న అత్యధిక పారితోషికం ఇదే అవుతుంది.

Updated Date - May 03 , 2025 | 06:34 AM