షూటర్ వస్తున్నాడు
ABN , Publish Date - Jun 05 , 2025 | 03:01 AM
అందమైన ప్రేమకథకు మిస్టరీ ఎలిమెంట్స్ జోడించి తీసిన చిత్రం ‘షూటర్’. సుమన్, రాశి, ఆమని, ఎస్తేర్ ప్రధాన తారాగణం. ఎస్. శ్రీనివాసులు స్వీయ దర్శకత్వంలో...
అందమైన ప్రేమకథకు మిస్టరీ ఎలిమెంట్స్ జోడించి తీసిన చిత్రం ‘షూటర్’. సుమన్, రాశి, ఆమని, ఎస్తేర్ ప్రధాన తారాగణం. ఎస్. శ్రీనివాసులు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఎస్. శ్రీనివాసులు మాట్లాడుతూ ‘థ్రిల్లింగ్ అంశాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రం ఇది. విభిన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. పతాక సన్నివేశాల్లో భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి’ అని అన్నారు.