మంచి సందేశంతో హృదయాన్ని బరువెక్కిస్తుంది

ABN , Publish Date - May 27 , 2025 | 03:17 AM

నూతన దర్శకుడు పవన్‌ప్రభ తెరకెక్కించిన చిత్రం ‘షష్ఠిపూర్తి’. డాక్టర్‌.రాజేంద్రప్రసాద్‌, అర్చన, రూపేశ్‌, ఆకాంక్ష సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. రూపేశ్‌ నిర్మించారు...

నూతన దర్శకుడు పవన్‌ప్రభ తెరకెక్కించిన చిత్రం ‘షష్ఠిపూర్తి’. డాక్టర్‌.రాజేంద్రప్రసాద్‌, అర్చన, రూపేశ్‌, ఆకాంక్ష సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. రూపేశ్‌ నిర్మించారు. ఈ నెల 30న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు పవన్‌ప్రభ. ‘‘సమాజంలోని పరిస్థితులను గమనిస్తునప్పుడు పుట్టిన కథ ఇది. వాణిజ్యాంశాలతో ఆకట్టుకుంటూనే, మంచి సందేశంతో హృదయాన్ని బరువెక్కిస్తుంది. కథానాయకుడు రూపేశ్‌ ఇందులో లాయర్‌గా కనిపిస్తారు. సినిమాలోని ప్రతీ పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. కథనం సరికొత్తగా ఉంటుంది. తల్లితండ్రుల విలువను హృద్యంగా ఆవిష్కరించి, అందరినీ మెప్పించే ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా ఇది’’ అని చెప్పారు.

Updated Date - May 27 , 2025 | 03:17 AM