మా దర్శకులకు శంకర్ ఒరిజనల్ గ్యాంగ్‌స్టర్
ABN , Publish Date - Jan 03 , 2025 | 06:30 AM
యువ దర్శకులు మమ్మల్ని చూసి గర్వపడుతుంటారు. కానీ మేం మాత్రం శంకర్‌ను చూసి పొంగిపోతుంటాం. దర్శకులకు ఆయన ఓ.జి.. ఒరిజనల్ గ్యాంగ్‌స్టర్. పెద్ద కలల్ని సినిమాగా తీస్తే డబ్బులు వెనక్కి వస్తాయని అందరిలో...
యువ దర్శకులు మమ్మల్ని చూసి గర్వపడుతుంటారు. కానీ మేం మాత్రం శంకర్‌ను చూసి పొంగిపోతుంటాం. దర్శకులకు ఆయన ఓ.జి.. ఒరిజనల్ గ్యాంగ్‌స్టర్. పెద్ద కలల్ని సినిమాగా తీస్తే డబ్బులు వెనక్కి వస్తాయని అందరిలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసిన దర్శకుడాయన. ‘గేమ్‌ఛేంజర్’తో వింటేజ్ శంకర్‌ను చూస్తాం’ అన్నారు దర్శకుడు రాజమౌళి. రామ్‌చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ రూపొందించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం ట్రైలర్‌ను గురువారం జరిగిన కార్యక్రమంలో విడుదల చేసిన అనంతరం రాజమౌళి మాట్లాడారు. ‘రామ్‌చరణ్ మగధీర’ నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్’కే ఎంతో ఎదిగిపోయారు. ఈ సినిమాలో ఆయన హెలికాప్టర్ నుంచి లుంగీ కట్టుకుని కత్తితో దిగుతుంటే విజిల్స్ ఎలా వస్తాయో నాకు తెలుసు’ అన్నారాయన.
‘గేమ్ ఛేంజర్’ సోషల్ కమర్షియల్, మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. ఓ పొలిటికల్ లీడర్‌కు, ఓ ఐఏఎస్ ఆఫీసర్‌కు మధ్య జరిగే కథ ఇది. ఈ సినిమాతో రామ్‌చరణ్ మళ్లీ అందరి హృదయాలు గెలుస్తారు’ అన్నారు శంకర్.
రామ్‌చరణ్ మాట్లాడుతూ ‘రాజమౌళి, శంకర్.. ఏ విషయంలోనూ రాజీ పడని దర్శకులు. ఇద్దరూ పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తుంటారు. ఆర్టిస్టులంతా అద్భుతంగా నటించడం వల్లే ఈ సినిమా ఎలివేట్ అవుతోంది. ఈ నెల 10న మీ ముందుకు వస్తున్నాం’ అని చెప్పారు. ట్రైలర్‌లో చూపించింది యాభై శాతం మాత్రమేనని, అసలు మేటర్ ఈ నెల 10న తెలుస్తుందని నిర్మాత దిల్ రాజు చెప్పారు.పెట్టిన దానికంటే ఎక్కువ లాభాలు రాబోతున్నాయని తెలిపారు.