సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం
ABN , Publish Date - Feb 27 , 2025 | 06:08 AM
‘కథాబలంతో పాటు బలమైన భావోద్వేగాలు ఉన్న హారర్ చిత్రం ‘శబ్దం’. ఇప్పటివరకూ వచ్చిన హారర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’...
‘కథాబలంతో పాటు బలమైన భావోద్వేగాలు ఉన్న హారర్ చిత్రం ‘శబ్దం’. ఇప్పటివరకూ వచ్చిన హారర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’ అని హీరో ఆది పినిశెట్టి అన్నారు. ‘వైశాలి’ చిత్రం తర్వాత దర్శకుడు అరివళగన్, ఆది పినిశెట్టి కలయికలో వస్తున్న చిత్రమిది. సెవెన్ జీ ఫిల్మ్స్ శివ నిర్మించారు. మైత్రీ డిస్ట్రిబ్యూషన్, ఎన్ సినిమాస్ ద్వారా ఈ నెల 28న ‘శబ్దం’ చిత్రం తెలుగులో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను ఆది పినిశెట్టి మీడియాతో పంచుకున్నారు. ‘‘ఇప్పటివరకూ ప్రేక్షకులకు తెలియని ఓ సరికొత్త ప్రపంచాన్ని ‘శబ్దం’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాం. ఇందులో అతీత శక్తుల గురించి అన్వేషించే పరిశోధకుడి పాత్రలో కనిపిస్తాను. సాంకేతికంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంటుంది. ఆత్మలకూ శబ్దానికి ఉన్న సంబందం ఏమిటనేది ఆసక్తికరంగా ఉంటుంది. ‘వైశాలి’ లానే ‘శబ్దం’ కూడా నిజాయితీగా చేసిన ప్రయత్నం.
తప్పక ఫలిస్తుందనే నమ్మకం ఉంది. సిమ్రాన్, లైలా పాత్రలు సినిమాలో కీలకం. తమన్ నేపథ్య సంగీతం అద్భుతంగా కుదిరింది. ప్రస్తుతం ‘అఖండ 2, మరకతమణి 2, మయసభ, డ్రైవ్’ చిత్రాలు చేస్తున్నాను’’ అని ఆయన చెప్పారు.
For AndhraPradesh News And Telugu News