సీనియర్‌ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ ఈశ్వర్‌ ఇక లేరు

ABN , Publish Date - May 16 , 2025 | 04:07 AM

ఐదు దశాబ్దాలుగా ఫిల్మ్‌ జర్నలి్‌స్టగా తెలుగు చిత్రపరిశ్రమలో ఉంటూ వివాదరహితుడైన బి.కె.ఈశ్వర్‌ (76) బుధవారం రాత్రి అనారోగ్యంతో కన్ను మూశారు....

ఐదు దశాబ్దాలుగా ఫిల్మ్‌ జర్నలి్‌స్టగా తెలుగు చిత్రపరిశ్రమలో ఉంటూ వివాదరహితుడైన బి.కె.ఈశ్వర్‌ (76) బుధవారం రాత్రి అనారోగ్యంతో కన్ను మూశారు. ఆయన పూర్తి పేరు భైరపి కోటేశ్వరరావు. ‘విజయచిత్ర’ మాస పత్రికలో చాలా కాలం పని చేశారు. జర్నలిస్టుగా తన అనుభవాలను బి.కె.ఈశ్వర్‌ ‘ఆంధ్రజ్యోతి’ సంస్థకు చెందిన ‘నవ్య’ వారపత్రికలో 62 వారాల పాటు ‘అనగా అనగా ఒకసారి’ పేరుతో వ్యాసాలు రాశారు. జర్నలిజానికి మాత్రమే పరిమితం కాకుండా ఈశ్వర్‌ పలు సినిమాలకు మాటలు, పాటలు కూడా రాశారు. గురువారం ఆయన అంత్యక్రియలు జూబ్లీ హిల్స్‌ శ్మశాన వాటికలో జరిగాయి.

Updated Date - May 16 , 2025 | 04:07 AM