చివరిదశ పనుల్లో బార్బరిక్‌

ABN, Publish Date - May 14 , 2025 | 05:34 AM

సత్యరాజ్‌ ప్రధాన పాత్రలో మోహన్‌ శ్రీవత్స తెరకెక్కిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. వశిష్ఠ.ఎన్‌.సింహా, సత్యం రాజేశ్‌, ఉదయభాను కీలక పాత్రలు...

సత్యరాజ్‌ ప్రధాన పాత్రలో మోహన్‌ శ్రీవత్స తెరకెక్కిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. వశిష్ఠ.ఎన్‌.సింహా, సత్యం రాజేశ్‌, ఉదయభాను కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు మారుతి సమర్పణలో విజయ్‌పాల్‌ రెడ్డి ఆడిదాల నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తై, ప్రస్తుతం చివరిదశ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినిస్తుందని తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: మార్తాండ్‌.కె.వెంకటేశ్‌, డీఓపీ: కుశేందర్‌ రమేశ్‌రెడ్డి, సంగీతం: ఇన్‌ఫ్యూజన్‌ బ్యాండ్‌.

Updated Date - May 14 , 2025 | 05:34 AM