Tribanadhari Barbarik: కట్టప్ప ప్రమోషన్స్ కు ఫిదా
ABN, Publish Date - May 13 , 2025 | 03:46 PM
సత్యరాజ్ (Satya Raj) ప్రధాన పాత్రలో ‘త్రిబాణధారి బార్బరిక్’ (Tribanadhari Barbarik)చిత్రం రాబోతోంది. మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స (Mohan Srivatsa) దర్శకత్వం వహించారు
సత్యరాజ్ (Satya Raj) ప్రధాన పాత్రలో ‘త్రిబాణధారి బార్బరిక్’ (Tribanadhari Barbarik)చిత్రం రాబోతోంది. మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స (Mohan Srivatsa) దర్శకత్వం వహించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి. ప్రస్తుతం ‘త్రిబాణధారి బార్బరిక్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇటీవల సినిమాను చూసిన టీం ఎంతో సంతోషంగా ఉంది.సినిమా అవుట్ ఫుట్ బాగా వచ్చిందన్న నమ్మకం వ్యక్తం చేస్తోంది టీం. సత్య రాజ్ చేస్తున్న ప్రమోషన్స్‌కి అందరూ ఫిదా అవుతున్నారు. కంటెంట్ మీద, సినిమా మీదున్న నమ్మకంతో సత్య రాజ్ ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ‘అనగా అనగా కథలా’ అనే పాటతో సత్య రాజ్ ఎమోషనల్‌గా అందరినీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ వంటి వారు నటించారు. ఇక ఉదయ భాను నెగెటివ్ షేడ్స్ ఉన్న కారెక్టర్ ద్వారా సినిమా మరింత ఇంట్రెస్టింగ్‌గా మారనుందని సమాచారం. ఓ మంచి రిలీజ్ డేట్ కోసం చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. త్వరలోనే సరైన విడుదల తేదీని టీం ప్రకటించనుంది.