ప్రసాద్‌ అనే నేను..

ABN , Publish Date - Mar 05 , 2025 | 06:28 AM

సప్తగిరి ప్రధాన పాత్రలో అభిలా్‌షరెడ్డి గోపిడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పెళ్లి కాని ప్రసాద్‌’. కె.వై.బాబు, భాను ప్రకాశ్‌ గౌడ్‌, సుక్కా వెంకటేశ్వర గౌడ్‌,...

సప్తగిరి ప్రధాన పాత్రలో అభిలా్‌షరెడ్డి గోపిడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పెళ్లి కాని ప్రసాద్‌’. కె.వై.బాబు, భాను ప్రకాశ్‌ గౌడ్‌, సుక్కా వెంకటేశ్వర గౌడ్‌, వైభవ్‌ రెడ్డి ముత్యాల నిర్మాతలు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఈనెల 21న చిత్రాన్ని విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా నటుడు ప్రభాస్‌ చిత్రం టీజర్‌ని లాంచ్‌ చేశారు. ‘ప్రసాద్‌ అనే నేను... కట్నం శాసనాల గ్రంథంలో ఉన్న రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌కు గౌరవం ఇస్తూ తరతరాలుగా కట్నం విషయంలో మా తాతముత్తాతలు ఫాలో అవుతున్న షరతులకు కట్టుబడి ఉంటానని మా తాతముత్తాతల మీద ప్రమాణం చేస్తున్నా’ అంటూ సప్తగిరి చెప్పే డైలాగ్స్‌తో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగింది.


For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 05 , 2025 | 06:28 AM