యాభై రోజులు పూర్తి

ABN , Publish Date - Mar 05 , 2025 | 06:41 AM

వెంకటేశ్‌ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ సినిమా 92 సెంటర్లలో 50 రోజులను...

వెంకటేశ్‌ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ సినిమా 92 సెంటర్లలో 50 రోజులను పూర్తి చేసుకున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. అత్యధిక వసూళ్లను సాధించిన తెలుగు రీజనల్‌ సినిమాగా ఘనత దక్కించుకుంది. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్‌, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించారు.

Updated Date - Mar 05 , 2025 | 06:41 AM