విజయ్‌ సినిమాలో సంజయ్‌దత్‌?

ABN , Publish Date - Feb 10 , 2025 | 06:17 AM

విజయ్‌ దేవరకొండ హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్త టాలీవుడ్‌లో...

విజయ్‌ దేవరకొండ హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్త టాలీవుడ్‌లో ప్రచారమవుతోంది. అంతేకాదు ‘ద మమ్మీ’ యాక్టర్‌ అర్నాల్డ్‌ వోస్లూ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడనే వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలపై మేకర్స్‌ ఇప్పటివరకూ స్పందించలేదు. కాగా, ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ ఓ సరికొత్త పాత్రలో కనిపించనున్నాడట. 1854-78 మధ్య కాలంలో జరిగే కథ కాబట్టి, సినిమాలో చాలా వేరియేషన్స్‌ ఉంటాయని తెలుస్తోంది. చిత్ర షూటింగ్‌ ఈనెల మూడో వారంలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. మొదటి షెడ్యూల్‌లో విజయ్‌ దేవరకొండ ఎంట్రీ సీన్‌ను చిత్రీకరించనున్నట్లు టాక్‌. నాని హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రం విజయవంతమైంది. దీంతో విజయ్‌ దేవరకొండ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.


త్వరలో వీడీ12 టైటిల్‌ టీజర్‌

విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతం తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వీడీ12(వర్కింగ్‌ టైటిల్‌) టైటిల్‌ టీజర్‌ ఈనెలలోనే వెలువడనున్నట్లు వార్తలొస్తున్నాయి. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా హిందీ టీజర్‌కు రణ్‌బీర్‌ కపూర్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. అదేవిధంగా తెలుగుకు ఎన్టీఆర్‌, తమిళ్‌కు ధనుష్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Also Read- Aaradhya Bachchan: ఆ కథనాలపై మరోసారి కోర్టుకెక్కిన ఐశ్వర్య రాయ్, అభిషేక్‌ల కుమార్తె..

Updated Date - Feb 10 , 2025 | 06:17 AM