జన్మజన్మల బంధం

ABN , Publish Date - May 04 , 2025 | 03:05 AM

సమంత నిర్మాతగా మారి ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై రూపొందించిన తొలి చిత్రం ‘శుభం’. ‘సినిమా బండి’ ఫేమ్‌ ప్రవీణ్‌ కండ్రీగుల తెరకెక్కించిన ఈ చిత్రంలో...

సమంత నిర్మాతగా మారి ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై రూపొందించిన తొలి చిత్రం ‘శుభం’. ‘సినిమా బండి’ ఫేమ్‌ ప్రవీణ్‌ కండ్రీగుల తెరకెక్కించిన ఈ చిత్రంలో హర్షిత్‌ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్‌, చరణ్‌ పెరి, షాలినీ కొండెపూడి ప్రధాన పాత్రలు పోషించారు. సమంత ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌గా ఓ ప్రమోషనల్‌ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ‘జన్మజన్మల బంధం’ అంటూ సాగే ఈ పాటలో ప్రధాన తారాగణంతో పాటు సమంత కూడా తళుక్కున మెరిశారు. మే 9న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - May 04 , 2025 | 03:05 AM