సల్మాన్ ‘లిటిల్ గిఫ్ట్’
ABN , Publish Date - Feb 19 , 2025 | 02:41 AM
సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సికందర్’. ‘టైగర్ 3’ తర్వాత సల్మాన్ నుంచి వస్తున్న చిత్రమిది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకుడు....
సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సికందర్’. ‘టైగర్ 3’ తర్వాత సల్మాన్ నుంచి వస్తున్న చిత్రమిది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకుడు. సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు. మంగళవారం సాజిద్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘లిటిల్ గిఫ్ట్’ పేరుతో చిత్రబృందం సల్మాన్ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేసింది. ఇందులో సల్మాన్‌ఖాన్ సరికొత్త లుక్‌లో కనిపించారు. తీక్షణమైన చూపులతో గంభీరంగా కనిపించిన సల్మాన్ సరికొత్త మేకోవర్‌తో ఆకట్టుకున్నారు. మంగళవారంతో సల్మాన్‌ఖాన్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. ఇక చిత్రబృందం ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. ఈ నెల 27న టీజర్‌ను, మార్చి తొలి వారంలో ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. రంజాన్ పర్వదినాన ‘సికందర్’ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read:
నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి
మొసలికి చుక్కలు చూపించిన ఏనుగు..
2 విడతల్లో డీఏ..? భారీ పెరగనున్న పెన్షన్లు, జీతాలు..!
For More Andhra Pradesh News and Telugu News..