ఆలయ రక్షణ కోసం
ABN , Publish Date - May 19 , 2025 | 03:32 AM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘భైరవం’. డా.జయంతిలాల్ గడా సమర్పణలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు....
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘భైరవం’. డా.జయంతిలాల్ గడా సమర్పణలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈనెల 30న చిత్రం విడుదలవుతున్న సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ట్రైలర్‌ని లాంఛ్ చేశారు. గ్రామంలోని వారాహి ఆలయం చుట్టూ కథ తిరుగుతుంది. రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి ఆలయం భూములపై కన్నేస్తాడు. దాంతో గ్రామంలో శాంతికి భంగం కలుగుతుంది. ఈ క్రమంలో ముగ్గురు స్నేహితులు కలసి ఆలయాన్ని, దాని వారసత్వాన్ని రక్షించేందుకు బలంగా నిలబడతారు. వారి మధ్య ఉన్న బంధం, ధైర్యం గ్రామ ప్రజల్లో ఆశలు చిగురింపజేస్తాయి. ట్రైలర్‌ని బట్టి చూస్తే కమర్షియల్ వాల్యూస్‌తో ఉన్న కథను దర్శకుడు చాలా ప్రభావశీలంగా తెరపై ఆవిష్కరించారనిపిస్తోంది.