లైలా పాత్రలో అదరగొట్టాడు - సాహు గారపాటి
ABN, Publish Date - Feb 09 , 2025 | 03:49 AM
‘మజిలీ’, ‘ఉగ్రం’, ‘భగవంత్ కేసరి’ వంటి హిట్ చిత్రాలను నిర్మించారు సాహు గారపాటి. ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘లైలా’. విష్వక్ సేన్ కథానాయకుడిగా రామ్‌నారాయణ్ తెరకెక్కించారు....
‘మజిలీ’, ‘ఉగ్రం’, ‘భగవంత్ కేసరి’ వంటి హిట్ చిత్రాలను నిర్మించారు సాహు గారపాటి. ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘లైలా’. విష్వక్ సేన్ కథానాయకుడిగా రామ్‌నారాయణ్ తెరకెక్కించారు. ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘‘సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. ఒక హీరో లేడీ పాత్రను చేయడం సవాల్‌తో కూడుకున్న విషయం. విశ్వక్ ‘సోనూ’గానే కాకుండా ‘లైలా’ పాత్రలోనూ అదరగొట్టారు. ‘సోనూ’ లైలా’గా ఎందుకు మారతాడో ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో ప్రేమ కథతో పాటు హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు ఉంటాయి. ఈ సినిమా యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులనూ అలరిస్తుంది. ప్రేక్షకులను నవ్వించడానికి చేసిన ప్రయత్నమే ‘లైలా’’ అని చెప్పారు.