Producer Shivalenka Krishna Prasad: అందరినీ హాయిగా నవ్విస్తుంది
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:03 AM
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘సారంగపాణి జాతకం’ హాయిగా నవ్వించే కుటుంబ కథానికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియదర్శి, రూప కొడువాయుర్ జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది
శివలెంక కృష్ణప్రసాద్
‘‘జెంటిల్‌మెన్’, ‘సమ్మోహనం’ తర్వాత ఇంద్రగంటి మోహన కృష్ణ- నా కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్ రాబోతోంది. మోహన్‌కృష్ణ కథ, కథనం అందరినీ ఆకట్టుకుంటాయి. సినిమా హాయిగా నవ్విస్తుంది’ అని అన్నారు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. ప్రియదర్శి, రూప కొడువాయుర్ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘సారంగపాణి జాతకం’ సినిమాను శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ప్రియదర్శి అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో అందరినీ నవ్విస్తారు. పూర్తి వినోదాన్ని అందిస్తూ పైసా వసూల్ అని అనిపించేలా సినిమాను అద్భుతంగా తెరకెక్కించాం. జంధ్యాల, ఈవీవీ స్టయిల్‌తో ఇంద్ర గంటి మార్క్‌ను మేళవించి ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఏప్రిల్ 18న థియేటర్లు దొరక్కపోవడంతో విడుదల తేదీని ఏప్రిల్ 25కి మార్చాం. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున, ఓవర్సీ్‌సలో 220కి పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం’ అని చెప్పారు.