మోగ్లీ యాక్షన్
ABN , Publish Date - Mar 16 , 2025 | 05:30 AM
తన తొలి సినిమా ‘బబుల్ గమ్’తో అందరి దృష్టినీ ఆకర్షించిన యువ నటుడు రోషన్ కనకాల ప్రస్తుతం ‘మోగ్లీ 2025’ చిత్రంలో నటిస్తున్నారు...
తన తొలి సినిమా ‘బబుల్ గమ్’తో అందరి దృష్టినీ ఆకర్షించిన యువ నటుడు రోషన్ కనకాల ప్రస్తుతం ‘మోగ్లీ 2025’ చిత్రంలో నటిస్తున్నారు. సందీప్ రాజ్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రోషన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘మోగ్లీ 2025’లో అతని పాత్ర స్వభావాన్ని తెలియజేసేలా ఈ పోస్టర్ ఉంది. సినిమా గ్లింప్స్‌లో రోషన్‌ను యాక్షన్ అవతార్‌లో చూపించారు. సాక్షి సాగర్ మడోల్కర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో విడుదల కానుంది.