వినోదం గ్యారంటీ

ABN , Publish Date - Mar 17 , 2025 | 02:45 AM

నితిన్‌ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. శ్రీలీల కథానాయిక. నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మించారు. ఈనెల 28న విడుదలవుతోంది...

నితిన్‌ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. శ్రీలీల కథానాయిక. నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మించారు. ఈనెల 28న విడుదలవుతోంది. చిత్రబృందం భీమవరంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో హీరో నితిన్‌ మాట్లాడుతూ ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకుల్ని నిరుత్సాహపరచదు. పూర్తి వినోదం గ్యారంటీ’’ అని అన్నారు. ‘‘మనసుపెట్టి తీసిన చిత్రమిది. కచ్చితంగా మీ అంచనాలను అందుకుంటుంది. సినిమా విజయంపై నమ్మకం ఉంది’’ అని వెంకీ కుడుముల చెప్పారు. ‘‘ఈ సినిమాను థియేటర్లలో మీ కుటుంబసభ్యులతో మిత్రులతో కలసి చూడండి. బాగా ఎంజాయ్‌ చేస్తారు’’ అని వై. రవిశంకర్‌ తెలిపారు.

Updated Date - Mar 17 , 2025 | 02:45 AM