యుద్ధానికి సిద్ధం

ABN, Publish Date - Jan 28 , 2025 | 04:42 AM

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఏ.ఎం.రత్నం, ఎ.దయాకర్‌ రావు నిర్మాతలు. మార్చి 28న విడుదలవుతోంది. ఈ చిత్రంలో విలన్‌గా...

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఏ.ఎం.రత్నం, ఎ.దయాకర్‌ రావు నిర్మాతలు. మార్చి 28న విడుదలవుతోంది. ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం సోమవారం పోస్టర్‌ని రిలీజ్‌ చేసింది. రాజుల కాలం నాటి దుస్తుల్లో ఉన్న బాబీ డియోల్‌ కత్తి పట్టుకొని యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు పోస్టర్‌లో కనిపించారు. ఈ సినిమాలో అనుపమ్‌ఖేర్‌, నిధి అగర్వాల్‌, నోరాహి ఫతేహి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలె ఈ సినిమాలోని ‘మాట వినాలి’ అనే పాటను విడుదల చేయగా అది ప్రేక్షకాదరణను పొందింది. పవన్‌ కల్యాణ్‌ ఆ పాటను స్వయంగా పాడారు.


Also Read- Allu Arjun: విధ్వంసం ఖాయమే.. ట్రెండింగ్ మార్కెట్‌ని పట్టుకున్నారు

Also Read- సూక్ష్మదర్శిని సిరీస్ స్ఫూర్తితోనే శవాన్ని మాయం చేశాడు..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 28 , 2025 | 04:42 AM