భర్తగా కాదు బంగారుగుడ్డు పెట్టే బాతులా చూశారు

ABN , Publish Date - May 16 , 2025 | 04:03 AM

తన భార్య ఆర్తిపై తమిళ హీరో రవి మోహన్‌ సంచలన ఆరోపణలు చేశారు. తనను ఓ భర్తగా కాకుండా బంగారుగుడ్డు పెట్టే బాతుగా చూశారని ఆరోపించారు. ప్రేమ పేరుతో...

తన భార్య ఆర్తిపై తమిళ హీరో రవి మోహన్‌ సంచలన ఆరోపణలు చేశారు. తనను ఓ భర్తగా కాకుండా బంగారుగుడ్డు పెట్టే బాతుగా చూశారని ఆరోపించారు. ప్రేమ పేరుతో తన డబ్బు, ఆస్తి అన్నింటిని ఉపయోగించుకున్నారని రవి గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో తన భార్య ఆర్తికి విడాకులు ఇవ్వడానికి గల కారణాలు, తమ మధ్య చోటుచేసుకున్న వివిధ అంశాలను ఆయన ప్రస్తావించారు. ‘‘కొన్నేళ్ళుగా వెన్నుపోటుకు గురవుతూ వచ్చాను. వారు ఇప్పుడు గునపంతో గుండెల్లో గుచ్చడం కూడా సంతోషంగా ఉంది. నా విడాకులకు గల కారణాలను నా బంధువులు, కుటుంబ సభ్యులు, నన్ను ప్రేమించే అభిమానులకు ఇప్పటికే వివరించాను’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

చెన్నై (ఆంధ్రజ్యోతి)

Updated Date - May 16 , 2025 | 04:03 AM