బాలీవుడ్‌లో మళ్లీ రష్మిక

ABN , Publish Date - Jun 05 , 2025 | 03:11 AM

హీరోయిన్‌ రష్మిక మంచి జోరు మీదున్నారు. తెలుగులోనే కాదు బాలీవుడ్‌లో కూడా ఆమె బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌ సరసన నటించిన ‘సికిందర్‌’ చిత్రం....

హీరోయిన్‌ రష్మిక మంచి జోరు మీదున్నారు. తెలుగులోనే కాదు బాలీవుడ్‌లో కూడా ఆమె బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్నారు. సల్మాన్‌ ఖాన్‌ సరసన నటించిన ‘సికిందర్‌’ చిత్రం ఇటీవల ఫ్లాప్‌ అయినా ఆ ప్రభావం ఆమె మీద లేదనే చెప్పాలి. హిందీలో ఆమెకు ఆఫర్లు వస్తునే ఉన్నాయి. ఇంతవరకూ రష్మిక ఐదు హిందీ చిత్రాల్లో నటించారు. వాటిల్లో ‘యానిమల్‌’, ‘చావా’ చిత్రాలు పెద్ద హిట్‌ . మిగిలిన మూడు సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు. తాజాగా ఇప్పుడు మరో హిందీ సినిమాకు రష్మిక కమిట్‌ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. 2012లో వచ్చిన ‘కాక్‌టైల్‌’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘కాక్‌టైల్‌ 2’ చిత్రంలో షాహిద్‌ కపూర్‌ సరసన రష్మిక నటించనున్నారు. క్రితీ సనన్‌ మరో కీలక పాత్ర పోషించనున్నారు. యూర్‌పలో సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అలాగే మనదేశంలో కూడా విభిన్న ప్రాంతాల్లో షూటింగ్‌ చేస్తారట. వచ్చే ఏడాది ‘కాక్‌టైల్‌ 2’ చిత్రం విడుదలవుతుంది.

Updated Date - Jun 05 , 2025 | 03:11 AM