టైటిల్ వీడియోకు సెన్సార్ అనుమతి
ABN , Publish Date - May 06 , 2025 | 05:26 AM
భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రామాయణ’ సినిమాకు సంబంధించి ఓ కీలక అడుగు పడింది. సాయిపల్లవి, రణబీర్ కపూర్ సీతారాములుగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని...
భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రామాయణ’ సినిమాకు సంబంధించి ఓ కీలక అడుగు పడింది. సాయిపల్లవి, రణబీర్ కపూర్ సీతారాములుగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నితీశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ వీడియోకు సెన్సార్ బోర్డ్ ఆమోద ముద్ర వేసింది. రెండు నిముషాల 36 సెకండ్లు ఉన్న ఈ వీడియోకు యు సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘రామాయణ’ చిత్రం ప్రమోషన్స్ అధికారికంగా ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. విమర్శలకు తావు లేకుండా అత్యంత భక్తిశ్రద్ధలతో చిత్రాన్ని తీస్తున్నామనీ, విజువల్ వండర్‌గా ప్రేక్షకులను ‘రామాయణ’ అలరిస్తుందనే నమ్మకం ఉందని నితీశ్ తివారీ పేర్కొన్నారు.