Ram Pothineni : ఆ ఇద్దరిపై రామ్ ఆశలు

ABN, Publish Date - Apr 26 , 2025 | 06:09 PM

వరుస పరాజయాలతో సతమతమౌతున్న రామ్ పోతినేని ప్రస్తుతం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేశ్ బాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలానే 'క' దర్శక ద్వయం చెప్పిన కథకూ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పోతినేని (Ram Pothineni )ని పరాజయాలు కంగారు పెడుతున్నాయి. 'ఇస్మార్ట్ శంకర్' (iSmart Shankar) తో బౌన్స్ బ్యాక్ అయ్యాడనుకుంటే... వరుసగా ఐదు ఫ్లాప్‌లతో మళ్లీ డౌన్ అయిపోయాడు. నిజానికి రామ్ టాలెంట్‌కి టాప్ లీగ్‌లో ఉండాల్సిన వాడు. కానీ వరుస ఫ్లాప్‌లతో ఆ ఛాన్స్ పోగొట్టు కుంటున్నాడు. ఇప్పుడు వరుసగా రెండు మూడు హిట్స్ కొడితేనే రామ్ జాతకం మారేట్టుంది. ఈ క్రమంలో ఎలాంటి స్టోరీతో రావాలో.. ఎవరితో సినిమా చేయాలో తెలియక ఇప్పటికే కొత్త సినిమా కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఓ సినిమా సెట్స్ పై ఉన్నప్పటికీ..‌ ఈ హీరోని ఇంకా సక్సెస్ టెన్షన్ వెంటాడుతూనే ఉంది.

ప్రస్తుతం రామ్ 22వ మూవీ సెట్స్ మీద ఉంది. దీనిని 'మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు (Mahesh Babu) డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ డైరెక్టర్‌కి గట్టి ట్రాక్ రికార్డ్ లేకపోయినా.. కథ నచ్చడంతో రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాపై రామ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. సక్సెస్‌తో రీ-ఎంట్రీ ఇవ్వాలని రామ్ ఫుల్ సీరియస్‌గా రేయింబవళ్లు కష్టపడుతున్నాడు. మరోవైపు ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే రామ్ తన నెక్స్ట్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు.


'క' మూవీతో హిట్ ను అందుకున్న సుజిత్ - సందీప్ (Sujith - Sandeep) డైరెక్టర్ ద్వయం రామ్‌కి ఓ కొత్త స్టోరీ నెరేట్ చేసిందట. ఈ కథ టోటల్ డిఫరెంట్ గా ఉండబోతోందని టాక్. రామ్‌కి కూడా స్టోరీ కిక్ ఇచ్చిందని, ఓకే చెప్పేశాడని తెలుస్తోంది. 22వ సినిమా తర్వాత 23వ ప్రాజెక్ట్‌గా ఇదే టేకాఫ్ అవుతుందని సమాచారం. సుజిత్ - సందీప్ తొలి చిత్రం 'క'తో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా రూ. 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడంతో పాటు... పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అవార్డులను అందుకుంటోంది. తాజాగా ఇది 15వ దాదా ఫాల్కే ఫిలిమ్ ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలిమ్ కేటగిరిలో నామినేషన్ ను పొందింది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఆ మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు వీళ్లు రామ్ కోసం స్పెషల్‌గా కథను తయారు చేసుకోవడం, దానికి రామ్ ఓకే చెప్పడం విశేషమే. మరి మహేశ్ బాబు సినిమాతో పాటు సుజీత్ - సందీప్ చిత్రంతోనూ రామ్ పోతినేని సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

Also Read: Chiranjeevi : 35 సంవత్సరాల తర్వాత త్రీడీలో చిరు మూవీ

Also Read: Sunil: తమిళ రాజకీయ నాయకుడిగా సునీల్‌..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 26 , 2025 | 06:10 PM