విగ్రహావిష్కరణకు ముహూర్తం
ABN, Publish Date - May 06 , 2025 | 05:23 AM
లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ఈ నెల 9న రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. ఈ విగ్రహావిష్కరణలో పాల్గొనడానికి లండన్ బయల్దేరారు మెగాస్టార్ చిరంజీవి...
లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో ఈ నెల 9న రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. ఈ విగ్రహావిష్కరణలో పాల్గొనడానికి లండన్ బయల్దేరారు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్, ఉపాసన, క్లీంకార. ఈ విగ్రహంలో రామ్‌చరణ్‌తో పాటు తన పెంపుడు కుక్క రైమీ కూడా ఉండనుంది. ఆవిష్కరణ అనంతరం ఈ విగ్రహాన్ని సింగపూర్‌కు తరలించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్‌లో అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, మహేశ్, ప్రభాస్, అల్లు అర్జున్, ఐశ్వర్యా రాయ్ తదితరుల విగ్రహాలను ఏర్పాటు చేశారు.