రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం
ABN, Publish Date - May 13 , 2025 | 03:03 AM
యువ కథానాయకుడు రామ్‌చరణ్ అరుదైన గౌరవం పొందారు. లండన్ మేడమ్ టుసాడ్స్‌లో ఆయన తన పెంపుడు కుక్క రైమ్‌తో కలసి మైనపు విగ్రహంగా కొలువు తీరారు...
యువ కథానాయకుడు రామ్‌చరణ్ అరుదైన గౌరవం పొందారు. లండన్ మేడమ్ టుసాడ్స్‌లో ఆయన తన పెంపుడు కుక్క రైమ్‌తో కలసి మైనపు విగ్రహంగా కొలువు తీరారు. ఈ విగ్రహం ఆయన విజయాన్ని మాత్రమే కాదు తన పెంపుడు కుక్కతో ఉన్న బంధాన్ని కూడా తెలియజేస్తుంది. రెండో క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఐకానిక్ మ్యూజియంలో తన పెంపుడు జంతువుతో నిలిచిన సెలబ్రిటీగా రామ్‌చరణ్ అరుదైన గౌరవం పొందారు. లండన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్ దంపతులు, సన్నిహితులు హాజరయ్యారు. ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులు దృష్ట్యా ప్రకటనను వాయిదా వేయాలని భావించారు. అయితే పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకోవడంతో ఈ ఆనందాన్ని ప్రపంచంతో పంచుకోవాలని మెగా కుటుంబం నిర్ణయించింది. అభిమానులు, సందర్శకుల కోసం ఈ నెల 19 వరకూ లండన్‌లో ఈ విగ్రహాన్ని ఉంచుతారు. ఆ తర్వాత సింగపూర్‌లోని మేడమ్ టుసాడ్స్ మ్యూజియంకు తరలిస్తారు.