Director Rajamouli: సైనికుల ఫొటోలు, వీడియోలు తీయొద్దు
ABN , Publish Date - May 10 , 2025 | 06:48 AM
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో రాజమౌళి సోషల్ మీడియాలో స్పందించారు. భారత సైనిక చర్యలను ఫొటోలు, వీడియోలు తీయకుండా, అవి షేర్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాజమౌళి
భారత్ - పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కొందరు సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు రాజమౌళి స్పందించారు. పాజిటివ్‌గా, అప్రమత్తంగా ఉంటే విజయం మనదేనని, సాయుధ దళాలని మెచ్చుకోవాల్సిందే అని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘ఒకవేళ భారత సైనిక చర్యలను చూస్తే ఫొటోలు, వీడియోలు తీయొద్దు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు. అలా చేస్తే శత్రువుకు సాయం చేసినట్టే. అనధికార ప్రకటనలు, అసత్య ప్రచారం నమ్మకండి’ అని పేర్కొన్నారు.