షూటింగ్‌లో రాశీ ఖన్నాకు గాయాలు

ABN , Publish Date - May 21 , 2025 | 01:37 AM

నటి రాశీ ఖన్నా షూటింగ్‌లో గాయపడ్డారు. ఆమె ముఖానికీ, చేతి వేళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆమె సోషల్‌మీడియా ద్వారా తెలిపారు...

నటి రాశీ ఖన్నా షూటింగ్‌లో గాయపడ్డారు. ఆమె ముఖానికీ, చేతి వేళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆమె సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. ‘‘కొన్ని పాత్రలు గాయాల్ని డిమాండ్‌ చేస్తాయి. ఆ గాయాలను లెక్కచేయకూడదు. మనమే ఒక తుపానుగా మారినప్పుడు ఏ పిడుగూ మనల్ని ఆపలేదు’’ అని పేర్కొన్నారు. ఆమెకు ఈ గాయాలు ‘ఫర్జీ 2’ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ సమయంలో అయినట్లు తెలుస్తోంది. కాగా, షాహిద్‌ కపూర్‌, విజయ్‌సేతుపతి, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్‌ ‘ఫర్జీ’. ప్రస్తుతం రెండో సీజన్‌ షూటింగ్‌ జరుగుతోంది.

Updated Date - May 21 , 2025 | 01:37 AM