Raa Raja: ఆర్టిస్ట్‌లు ఎవరూ కనిపించరు.. కొత్త ప్రయోగం
ABN , Publish Date - Feb 21 , 2025 | 09:58 AM
ఆర్టిస్టుల్ని చూపించకుండా కేవలం కథ, కథనాల మీదే నడిచే చిత్రం ‘రా రాజా’ (Raa Raja). శ్రీమతి పద్మ సమర్పణలో పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ (B Siva Prasad)తెరకెక్కించిన చిత్రమిది.
ఆర్టిస్టుల్ని చూపించకుండా కేవలం కథ, కథనాల మీదే నడిచే చిత్రం ‘రా రాజా’ (Raa Raja). శ్రీమతి పద్మ సమర్పణలో పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ (B Siva Prasad)తెరకెక్కించిన చిత్రమిది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వీక్షించి చిత్ర బృందాన్ని అభినందించారు. అనంతరం రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. మార్చి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తమ్మారెడ్డి భరద్వాజ (Bharadwaja Thammareddy) మాట్లాడుతూ ‘రా రాజా’ మూవీ టైటిల్‌ను గమనిస్తే కొత్త ప్రేమకథలా ఉంది. అయితే ఈ చిత్రంలో ఒక్క మొహం కూడా కనిపించదు. అసలు మొహం చూపించకుండా సినిమా తీసి దర్శకుడు ధైర్యం చేశాడు. డ్యూయెల్ అని స్పీల్ బర్గ్ తీసిన చిత్రంలోనూ మొహం కనిపించదు. అలానే ఈ చిత్రంలో మొహాలు కనిపించవని అంటున్నారు. ఇది చాలా పెద్ద ప్రయోగం. ఇది కనుక సక్సెస్ అయితే ఇండస్ర్టీ మొత్తం మారిపోతుంది. అసలు హీరోలు, స్టార్స్‌తో పని లేకుండా అద్భుతమైన చిత్రాలు ప్రయోగాలు చేయొచ్చని అంతా ముందుకు వస్తారు. హీరో హీరోయిన్ల కోసం సినిమాలకు వస్తుంటారు. కానీ ఇందులో మొహాలు కూడా కనిపించవు. కథే ముందుకు వెళ్తుంటుంది. ఇది మంచి ఐడియా ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ బాగుంది. మార్చి 7న వస్తున్న ఈ చిత్రం అందర్నీ మెప్పిస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు.