Producer Bhushan Kumar: స్పిరిట్ తర్వాతే
ABN , Publish Date - May 03 , 2025 | 06:43 AM
ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోందన్న వార్తలను నిర్మాత భూషణ్ కుమార్ ఖండించారు. ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ రెండు, మూడు నెలల్లో ప్రారంభమవుతుందని, దాని తర్వాతే ‘యానిమల్ పార్క్’ రూపొందిస్తామన్నారు.
ప్రభాస్ హీరోగా సందీ్‌పరెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే మొదట ‘యానిమల్’కు సీక్వెల్‌గా ‘యానిమల్ పార్క్’ ప్రారంభమవుతుందని, అందువల్ల ‘స్పిరిట్’ షూటింగ్ ఆలస్యం అవుతోందంటూ వార్తలు వెలువడ్డాయి. తాజాగా నిర్మాత భూషణ్ కుమార్ ఈ వార్తలను ఖండించారు. మరో రెండు, మూడు నెలల్లో ‘స్పిరిట్’ షూటింగ్ ప్రారంభం అవుతుందన్నారు. దీని తర్వాతే ‘యానిమల్ పార్క్’ను రూపొందిస్తామని స్పష్టం చేశారు.