Priyanka Chopra : దోమకొండ కోటలో ప్రియాంక చోప్రా
ABN, Publish Date - Jan 25 , 2025 | 05:04 AM
కామారెడ్డి జిల్లాలోని దోమకొండ గడికోటలో శుక్రవారం ప్రముఖ నటి ప్రియాంకచోప్రా సందడి చేశారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆమె గడి కోటలో ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడి శివాలయంలో ప్రత్యేక
కామారెడ్డి జిల్లాలోని దోమకొండ గడికోటలో శుక్రవారం ప్రముఖ నటి ప్రియాంకచోప్రా సందడి చేశారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆమె గడి కోటలో ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కోట తరపున సిబ్బంది తీర్థప్రసాదాలు అందజేశారు. కోట సీనియర్ మేనేజర్ బాబ్జి హీరోయిన్‌కు జ్ఞాపికను అందజేశారు. అద్దాల బంగ్లా, సొరంగ మార్గం, చుట్టూ కందకం, కోట చరిత్రను వివరించారు. ప్రియాంక చోప్రా గతంలో రాంచరణ్‌తో ‘జంజీర్’ సినిమాలో నటించారు. ఆయన శ్రీమతి ఉపాసన ఈ కోటకు వారసురాలు అనే విషయం తెలిసిందే. ప్రియాంక చోప్రా దోమకొండకు వచ్చిందన్న విషయం తెలుసుకున్న స్థానికులు ఉదయమే కోట వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆమెను చూసేందుకు ఎగబడ్డారు.
దోమకొండ (ఆంధ్రజ్యోతి)