గ్రామీణ ప్రేమకథ
ABN , Publish Date - May 12 , 2025 | 04:47 AM
సాత్విక్‌వర్మ, ప్రీతి నేహా జంటగా భాను దర్శకత్వంలో గ్రామీణ ప్రేమకథ నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి ‘ప్రేమిస్తున్నా’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు...
సాత్విక్‌వర్మ, ప్రీతి నేహా జంటగా భాను దర్శకత్వంలో గ్రామీణ ప్రేమకథ నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి ‘ప్రేమిస్తున్నా’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు యూనిట్ ఆదివారం తెలిపింది. ఇప్పటివరకూ ఎవరూ స్పృశించని ప్రేమగాథతో ఈ చిత్రం తెరకెక్కుతోందని దర్శకుడు చెప్పారు. యువతను మెప్పించే అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం సిద్ధార్థ్ సాలూరి. సినిమాటోగ్రఫీ: భాస్కర్ శ్యామల