పర్సెంటేజీ విధానాన్ని అమలు చేయాలి

ABN, Publish Date - May 22 , 2025 | 05:53 AM

థియేటర్ల బంద్‌ విషయంపై తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఛైర్మన్‌ ప్రతానిరామకృష్ణ గౌడ్‌ స్పందించారు. ‘‘2002 వరకూ పర్సెంటేజీ విధానమే అమల్లో ఉండేది. ఆ తర్వాత అది రెంట్‌ విధానంలోకి...

ప్రతాని రామకృష్ణ గౌడ్‌

థియేటర్ల బంద్‌ విషయంపై తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఛైర్మన్‌ ప్రతానిరామకృష్ణ గౌడ్‌ స్పందించారు. ‘‘2002 వరకూ పర్సెంటేజీ విధానమే అమల్లో ఉండేది. ఆ తర్వాత అది రెంట్‌ విధానంలోకి మారింది. అప్పటి నుంచే సింగల్‌ థియేటర్లకు కష్టాలు మొదలయ్యాయి. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు పర్సెంటేజీ విధానమే లాభదాయకమైనది. చిన్న నిర్మాతలకు మరింత మేలు జరుగుతుంది. ఇప్పుడు థియేటర్స్‌ మూతపడితే మాలాంటి నిర్మాతలకు భారీ నష్టం జరుగుతుంది’’ అని ప్రతాని అన్నారు. ఆయన నటించి స్వీయ దర్శకత్వం వహించి ఆర్‌.కె ఫిల్మ్స్‌ బ్యానర్‌పై నిర్మించిన ‘దీక్ష’ చిత్రం విడుదలకు సిద్ధమైంది.

Updated Date - May 22 , 2025 | 05:53 AM