Biopic : మంచి స్పందన వస్తోంది
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:40 AM
మూలవిరాట్, పద్మ, రాజ్‌కుమార్, స్వప్న నటీ నటులుగా ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో విజయలక్ష్మీ జైనీ నిర్మించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్. ఇటీవలె విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
మూలవిరాట్, పద్మ, రాజ్‌కుమార్, స్వప్న నటీ నటులుగా ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో విజయలక్ష్మీ జైనీ నిర్మించిన చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’ బయోపిక్. ఇటీవలె విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత విజయలక్ష్మి మాట్లాడుతూ‘ తెలంగాణకు చెందిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు కాళోజీ నారాయణరావు జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. విద్యార్థుల కోసం ఉదయం ఆటను ఉచితంగా ప్రదర్శిస్తున్నాం. దీనికి విద్యార్థుల నుంచి మంచి స్పందన వస్తోంది’ అని తెలిపారు. చిత్ర దర్శకుడు ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ ‘ప్రేక్షకుల నుంచి మేము ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా విడుదలకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు నా ధన్యవాదాలు’ అని అన్నారు.