రాజాసాబ్ వచ్చేది అప్పుడే
ABN , Publish Date - Jun 04 , 2025 | 05:30 AM
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా హారర్ థ్రిల్లర్ ‘రాజాసాబ్’. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం కొంతకాలంగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు తియ్యటి కబురందించారు...
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా హారర్ థ్రిల్లర్ ‘రాజాసాబ్’. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం కొంతకాలంగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు తియ్యటి కబురందించారు మేకర్స్. సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే ఈ నెల 16న టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ‘‘మీ అందరికీ ప్రామిస్ చేసినట్లే మీరు చూడాలనుకుంటున్న విధంగా ప్రభా్‌సను వెండితెరపై చూస్తారు. ఆ రోజు అభిమానులకు పండగే. మీలో జోష్ నింపేందుకు మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి’’ అని పేర్కొన్నారు. కాలిపోతున్న డబ్బుల కట్టల ముందు నిల్చున్న ప్రభాస్ స్టిల్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. సంజయ్‌దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్ కథానాయికలు.