ప్రభాస్, ప్రశాంత్ వర్మ చిత్రం.. ఎప్పటినుంచి?
ABN , Publish Date - Feb 27 , 2025 | 06:10 AM
హీరో ప్రభాస్ స్పీడ్ పెంచారు. చేతిలో ఉన్న సినిమాలు చకచకా పూర్తి చేస్తూ కొత్త వాటి మీద కూడా దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన ‘రాజా సాబ్’, ‘ఫౌజీ’ సినిమాలు చేస్తున్నారు....
హీరో ప్రభాస్ స్పీడ్ పెంచారు. చేతిలో ఉన్న సినిమాలు చకచకా పూర్తి చేస్తూ కొత్త వాటి మీద కూడా దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన ‘రాజా సాబ్’, ‘ఫౌజీ’ సినిమాలు చేస్తున్నారు. ఇవి కాకుండా సందీ్‌పరెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందే ‘స్పిరిట్’ సినిమా చేయాలి. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా వీలైనంత త్వరలో ప్రారంభిచాలని ప్రభాస్ ఆలోచన. ఇప్పుడు ఆయన మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తార నీ, ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ లుక్ టెస్ట్ కూడా జరిగిందని సమాచారం. ఇవి కాకుండా ‘కల్కి పార్ట్ 2’, ‘సలార్ 2’ చిత్రాలను ప్రభాస్ చేయాలి. ఇన్ని సినిమాలు ప్రభాస్ ఎప్పుడు, ఎలా చేస్తారు, వీటిల్లో ఏది ముందు మొదలవుతుందనేదే ఆ చర్చ.
For AndhraPradesh News And Telugu News