పూజా హెగ్డే ప్రత్యేక గీతం

ABN , Publish Date - Feb 28 , 2025 | 02:36 AM

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఆమె లుక్‌ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది...

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఆమె లుక్‌ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. బుధవారం ‘ఈ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టండి’ అంటూ ఓ ప్రీలుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. తాజాగా ఆ పోస్టర్‌ పూజా హెగ్డేదేనంటూ ప్రకటించింది. అయితే, ఈ మూవీలో పూజా హెగ్డే కీలక పాత్రను పోషిస్తున్నారా? లేక స్పెషల్‌ సాంగ్‌లో నర్తిస్తున్నారా?

అనేది తెలియాల్సివుంది. ‘జైలర్‌’ సినిమాలో హీరోయిన్‌ తమన్నా ‘కావాలయ్యా’ పాట తరహాలో సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌ ఓ ప్రత్యేక గీతాన్ని ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ గీతంలో నర్తించేందుకు పూజా హెగ్డేను ఎంపిక చేసినట్టు అభిమానులు భావిస్తున్నారు. ఈ మూవీలో ఆమీర్‌ ఖాన్‌, నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్‌, శ్రుతిహాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

-చెన్నై, ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 28 , 2025 | 02:37 AM